ప్రార్థన వలనే పయనము
praarthana valanee payanamu
ప్రార్థన వలనే పయనము – ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము – ప్రార్థన లేనిదే పరాజయం (2) ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా (2) ||ప్రార్థన||
praarthana valanee payanamu – praarthanee praakaaramu praarthanee praadhaanyamu – praarthana leenidee paraajayam (2) prabhuvaa praarthana neerpayyaa praardhinchakundaa nee undaleenayyaa nee paadaalu thadapakundaa naa payanam saagadayyaa (2) ||praarthana||
ప్రార్ధనలో నాటునది – పెల్లగించుట అసాధ్యము ప్రార్ధనలో పోరాడునది – పొందకపోవుట అసాధ్యము ప్రార్ధనలో ప్రాకులాడినది – పతనమవ్వుట అసాధ్యము ప్రార్ధనలో పదునైనది – పనిచేయకపోవుట అసాధ్యము (2) ||ప్రభువా||
praardhanaloo naatunadi – pellaginchuta asaadhyamu praardhanaloo pooraadunadi – pondakapoovuta asaadhyamu praardhanaloo praakulaadinadi – pathanamavvuta asaadhyamu praardhanaloo padunainadi – panicheeyakapoovuta asaadhyamu (2) ||prabhuvaa||
ప్రార్ధనలో కనీళ్లు – కరిగిపోవుట అసాధ్యము ప్రార్ధనలో మూల్గునది – మరుగైపోవుట అసాధ్యము ప్రార్ధనలో నలిగితే – నష్టపోవుట అసాధ్యము ప్రార్ధనలో పెనుగులాడితే – పడిపోవుట అసాధ్యము
praardhanaloo kaneelllu – karigipoovuta asaadhyamu praardhanaloo muulgunadi – marugaipoovuta asaadhyamu praardhanaloo naligithee – nasstapoovuta asaadhyamu praardhanaloo penugulaadithee – padipoovuta asaadhyamu