ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది
praarthinchumu nee jeevithamuloo nemmadi
ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు (2) సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు (2) ||ప్రార్థించుము||
praarthinchumu nee jeevithamuloo nemmadi sukhamu londedavu (2) sanpuurnna bhakthini kaliginchunu ksseemamulennoo pondedavu (2) ||praarthinchumu||
యెడతెగక నీవు ప్రార్థించినా విసుగక నీవు ప్రార్థించినా సమస్తమును నీవు పొందెదవు తప్పక న్యాయము పొందెదవు నీ కొరకై ప్రభు వేచియున్నాడు ప్రార్థనలో కనిపెట్టుము కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను భయపడకుము ప్రభువే నీకు జయము నిచ్చును ప్రభువే మనతో సెలవిచ్చెను మెళకువగా నుండి ప్రార్థించుమని విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందెదవు ప్రభువచ్చు వేళాయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెళకువగా నుండుడి యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును
yedathegaka neevu praarthinchinaa visugaka neevu praarthinchinaa samasthamunu neevu pondedavu thappaka nyaayamu pondedavu nee korakai prabhu veechiyunnaadu praarthanaloo kanipettumu kasstamu nasstamu kaliginanu shoodhana baadhalu vachchinanu saathaanu neepai vijrunbhinchi ninnu gaayaparachinanu bhayapadakumu prabhuvee neeku jayamu nichchunu prabhuvee manathoo selavichchenu mellakuvagaa nundi praarthinchumani vishvaasamu koolpooyee dinamulaloo vishvaasamuthoo praarthinchinaa saathaanu durgamulanu padagotti balamu pondedavu prabhuvachchu veellaayee gamaninchumu aathma valana prathi vissayamuloo praarthana vijnyaapana cheeyuchu puurnnamaina pattudalathoo parishuddhula korakai vijnyaapanamu cheeyuchu mellakuvagaa nundudi yeruussaleemu ksseemamukai anyajanula rakssannakai bhaaramuthoo neevu praarthinchina prabhuvee neeku phalamichchunu vaari ksseemamee nee ksseemamunaku aadhaaramagunu