ప్రభు యేసు.. ప్రభు యేసు
prabhu yeesu.. prabhu yeesu
ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో || ప్రభు యేసు ||
prabhu yeesu.. prabhu yeesu – adigoo shrama nondenu khaideelanu vidipinchenu siluvaloo || prabhu yeesu ||
ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా అంతగా బాధించి సిలువమీది కెత్తిరి బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక (2) || ప్రభు యేసు ||
entha kruuramoo.. entha kruuramoo – shathru kaaryamu chuudumaa anthagaa baadhinchi siluvameedi keththiri baadhanondiyu.. baadhanondiyu – eduru maatalaadaka (2) || prabhu yeesu ||
ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను మూడవనాడు సమాధినుండి లేచెను విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు దేవయని ప్రభు అరచిన యపుడు దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను (2) || ప్రభుయేసు ||
mundla makutamu.. mundla makutamu – thana thala nunchiri muurkhula debbala baadhanu sahinchenu muusiyundina.. muusiyundina mookssadvaaramu therachi aathmadeevudu.. aathmadeevudu – prathyakssanbaaye siluvaloo suuryudadrushyudai krammenantha cheekati saarvathrikamu.. saarvathrikamu – gadagada vannikenu maranninchenu.. maranninchenu – samaadhi nunchabadenu muudavanaadu samaadhinundi leechenu vidipinchenu.. vidipinchenu maranna bandhithulanu theesiveesenu.. theesiveesenu – naa paapa neeramanthayu deevayani prabhu arachina yapudu deevuni daya.. deevuni daya – kummarinchabadenu (2) || prabhuyeesu ||
కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని నీకువేరుగా నారక్షణిల లేదుగా నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు
kaaru cheekatiloo.. kaaru cheekatiloo – duhkhanbuloo neenuntini neekuveerugaa naarakssannila leedugaa naadu shramalu.. naadu shramalu – veerevvaru nerugaru