ప్రభువా నీ పరిపూర్ణత నుండి
prabhuvaa nee paripuurnnatha nundi
ప్రభువా నీ పరిపూర్ణత నుండి పొందితిమి కృప వెంబడి కృపను ప్రభువైన యేసు క్రీస్తు – పరలోక విషయములో ప్రతి ఆశీర్వాదమును – ప్రసాదించితివి మాకు ||ప్రభువా||
prabhuvaa nee paripuurnnatha nundi pondithimi krupa venbadi krupanu prabhuvaina yeesu kreesthu – paralooka vissayamuloo prathi aasheervaadamunu – prasaadinchithivi maaku ||prabhuvaa||
జనకా నీ-వెన్నుకొనిన – జనుల క్షేమము జూచి సంతోషించునట్లు – నను జ్ఞాపకముంచుకొనుము నీదు స్వాస్థ్యమైనట్టి – నీ ప్రజలతో కలిసి కొనియాడునట్లుగా – నను జ్ఞాపకముంచుకొనుము దేవా నీదు స్వరూప – దివ్య దర్శనమును దినదినము నాకొసగి – నను జ్ఞాపకముంచుకొనుము మీ మధ్యన నా ఆత్మ – ఉన్నది భయపడకు డనిన మహోన్నతుడా – నను జ్ఞాపకముంచుకొనుము ముదమారా నన్నెన్నుకొని – ముద్ర యుంగరముగను చేతుననిన ప్రభువా – నను జ్ఞాపకముంచుకొనుము కృపా సత్య సమ్మిళిత – సంపూర్ణ స్వరూప హల్లెలూయా నీకే ప్రభో – ఎల్లప్పుడూ కలుగుగాక
janakaa nee-vennukonina – janula ksseemamu juuchi santhoossinchunatlu – nanu jnyaapakamunchukonumu needu svaasthyamainatti – nee prajalathoo kalisi koniyaadunatlugaa – nanu jnyaapakamunchukonumu deevaa needu svaruupa – divya darshanamunu dinadinamu naakosagi – nanu jnyaapakamunchukonumu mee madhyana naa aathma – unnadi bhayapadaku danina mahoonnathudaa – nanu jnyaapakamunchukonumu mudamaaraa nannennukoni – mudra yungaramuganu cheethunanina prabhuvaa – nanu jnyaapakamunchukonumu krupaa sathya sammillitha – sanpuurnna svaruupa halleluuyaa neekee prabhoo – ellappuduu kalugugaaka