ప్రతి రోజు చూడాలని నా
prathi rooju chuudaalani naa
ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2) తనివి తీర చూసినా నా యేసయ్య రూపం నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి||
prathi rooju chuudaalani naa prabhuvaina yeesayyanu palumaarlu chuudaalani naa priyudaina yeesayyanu (2) thanivi theera chuusinaa naa yeesayya ruupam naa hrudayamee pongi porlunu naa manasee santhoossinchunu (2) ||prathi||
పరలోకమందున పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను జీవ జలము యొద్దకు నడిపించును ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును ఆకాశమందున రారాజుగా వచ్చును భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు కడబూరధ్వని వినిపించును పరలోక సైన్యముతో వచ్చును
paralookamanduna parishuddha duuthalathoo parishuddhudu parishuddhudu ani sthuthiyinchabaduchundenu jeeva jalamu yoddaku nadipinchunu prathi baasspa binduvu thudichiveeyunu aakaashamanduna raaraajugaa vachchunu bhuujanulandaru rommu kottukonuchunduru kadabuuradhvani vinipinchunu paralooka sainyamuthoo vachchunu