ప్రేమా అనే మాయలో చిక్కుకున్న
preemaa anee maayaloo chikkukunna
ప్రేమా అనే మాయలో చిక్కుకున్న సోదరి కన్న వారి కలలకు దూరమై కష్టాల కడలిలో చేరువై (2) ||ప్రేమా||
preemaa anee maayaloo chikkukunna soodari kanna vaari kalalaku duuramai kasstaala kadaliloo cheeruvai (2) ||preemaa||
తల్లిదండ్రులు కలలు గని రెక్కలు ముక్కలు చేసుకొని (2) రక్తము చెమటగా మార్చుకొని నీ పైన ఆశలు పెట్టుకొని నిన్ను చదివిస్తే – పట్టణం పంపిస్తే ప్రేమకు లోబడి – బ్రతుకులో నీవు చెడి – (2) ||కన్న||
thallidandrulu kalalu gani rekkalu mukkalu cheesukoni (2) rakthamu chematagaa maarchukoni nee paina aashalu pettukoni ninnu chadivisthee – pattannam panpisthee preemaku loobadi – brathukuloo neevu chedi – (2) ||kanna||
ప్రభు ప్రేమను వదులుకొని ఈ లోక ఆశలు హత్తుకొని యేసయ్య క్షమను వలదని దేవుని పిలుపును కాదని నీవు జీవిస్తే – తనువు చాలిస్తే నరకము చేరుకొని – అగ్నిలో కూరుకొని – కొన్న తండ్రి కలలకు దూరమై కష్టాల కోడలికి చేరువై
prabhu preemanu vadulukoni ee looka aashalu haththukoni yeesayya kssamanu valadani deevuni pilupunu kaadani neevu jeevisthee – thanuvu chaalisthee narakamu cheerukoni – agniloo kuurukoni – konna thandri kalalaku duuramai kasstaala koodaliki cheeruvai