ప్రేమతో యేసు – పిలచుచున్నాడు
preemathoo yeesu – pilachuchunnaadu
ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2) ||ప్రేమతో||
preemathoo yeesu – pilachuchunnaadu rammu rakssannanu pondi – lakssannamugaa vellllumu (2) ||preemathoo||
పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను శాపగ్రాహియాయె సిలువలో శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడె ప్రాణమిడె నేసు సిలువలో ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము సిలువలో నీకై దప్పిగొని కలుష నీ క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడె నీ కొరకు సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించె కాపరి స్వరము ధ్వనించె కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము తామసించ తగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము తానే కడుగును తన రక్తముతో తండ్రివలె నీ పాపమునంత తనయుడవై పోదు విపుడే తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము ప్రేమవార్త ప్రకటింపబడె ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము కృపాకాలమిదే జాగేల కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము
paapamerugani prabhu nee koraku paapamuganu cheeyabadenu shaapagraahiyaaye siluvaloo shaapagraahiyaaye siluvaloo parugidi rammu mundla kireetamunu dharinchi mukhamupai nummi veeyabade praannamide neesu siluvaloo praannamide neesu siluvaloo parugidi rammu siluvaloo neekai dappigoni kalussa nee kssamakai praarthinchi sahinchi praannamide nee koraku sahinchi praannamide nee koraku parugidi rammu thappina gorrenu rakssinpa thanadu rakthamunu chindinche kaapari svaramu dhvaninche kaapari svaramu dhvaninche parugidi rammu thaamasincha thagadika priyudaa thvarapadumu nee rakssanna koraku needee nee rakssanna dinamu needee nee rakssanna dinamu parugidi rammu thaanee kadugunu thana rakthamuthoo thandrivale nee paapamunantha thanayudavai poodu vipudee thanayudavai poodu vipudee parugidi rammu preemavaartha prakatinpabade priyudu yeesuni yoddaku rammu krupaakaalamidee jaageela krupaakaalamidee jaageela parugidi rammu