ప్రియ యేసు మన కొరకు
priya yeesu mana koraku
ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగ కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు||
priya yeesu mana koraku preemathoo pondina shramalu kaanchaga kalvari drushyam kaarenu kallllaloo rudhiram (2) ||priya yeesu||
కల్వరి కొండపైన దొంగాల మధ్యలోన సిల్వలోన వ్రేలాడెను నాకై యేసు మరణించెను ముండ్లతో అల్లిన మకుటం జల్లాటమున పెట్టగా స్రవించె పరిశుద్ధ రక్తం ద్రవించె నా హృదయం పాపాంధకారములో పయనించు మనుజులను పావనులుగా చేయుటకు పావనుడేసు మరణించెను పాపినైన నా కొరకు ప్రేమించి ప్రాణమిచ్చెను సిల్వలో వ్రేళాడెను నీకై ప్రాణమునిచ్చెను
kalvari kondapaina dongaala madhyaloona silvaloona vreelaadenu naakai yeesu maranninchenu mundlathoo allina makutam jallaatamuna pettagaa sravinche parishuddha raktham dravinche naa hrudayam paapaandhakaaramuloo payaninchu manujulanu paavanulugaa cheeyutaku paavanudeesu maranninchenu paapinaina naa koraku preeminchi praannamichchenu silvaloo vreellaadenu neekai praannamunichchenu