రాజాధి రాజ రవి కోటి
raajaadhi raaja ravi kooti
రాజాధి రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక (2) విడువని కృప నాలో స్థాపించెనే సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2) ||రాజాధి||
raajaadhi raaja ravi kooti theeja ramanneeya saamraajya paripaalaka (2) viduvani krupa naaloo sthaapinchenee seeyoonuloo nunna sthuthula sinhaasanamunu (2) ||raajaadhi||
వర్ణనకందని పరిపూర్ణమైన నీ మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద ఊహలకందని ఉన్నతమైన నీ ఉద్దేశములను – నా యెడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో మకుటము ధరించిన మహారాజువై నీ సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే
varnnanakandani paripuurnnamaina nee mahima svaruupamunu – naa korakee thyaagamu cheesi krupaa sathyamulathoo kaapaaduchunnaavu dinamella nee keerthi mahimalanu – neenu prakatincheda uuhalakandani unnathamaina nee uddeeshamulanu – naa yedala saphalaparachi uureeginchuchunnaavu vijayoothsavamuthoo yeesayya nee kannaa thoodevvaru – leeru ee dharanniloo makutamu dharinchina mahaaraajuvai nee saubhaagyamunu – naa korakee siddhaparachithivi nee parishuddhamaina maargamuloo nadichi nee saakssinai kaankssathoo paadeda – sthoothra sankeerthanalee