రాజ్యాలనేలే మహారాజు రాజుగా నిన్ను
raajyaalaneelee mahaaraaju raajugaa ninnu
రాజ్యాలనేలే మహారాజు రాజుగా నిన్ను చూడాలని (2) సింహాసనాన్ని విడిచి ఇలలో సామాన్యునిగా అరుదెంచెన్ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ పావనమాయెను ఈ ధరణి నీ – దివ్య పాదాలు మోపగనే పాపపు సంకెళ్లు తెగిపోయే అతి – పరిశుద్ధుడు అరుదెంచగనే చీకటినంత పారద్రోల పావనుడా పవళించావు ప్రతి హృదయాన్ని వెలుగుతో నింప నీతి సూర్యుడా ఉదయించావు ||హ్యాప్పీ||
raajyaalaneelee mahaaraaju raajugaa ninnu chuudaalani (2) sinhaasanaanni vidichi ilaloo saamaanyunigaa arudenchen hyaappee hyaappee krismas merri merri krismas paavanamaayenu ee dharanni nee – divya paadaalu moopaganee paapapu sankelllu thegipooyee athi – parishuddhudu arudenchaganee cheekatinantha paaradroola paavanudaa pavallinchaavu prathi hrudayaanni veluguthoo ninpa neethi suuryudaa udayinchaavu ||hyaappee||
తారను చూసిన జ్ఞానులు – చేరిరి ప్రభుని చెంతకు బంగారము సాంబ్రాణి బోళమును – అర్పించిరి భయ భక్తులతో గొల్లలు జ్ఞానులు పిల్లలు పెద్దలు పరవిశించిరి నీ రాకతో ఆనందమాయెను ఈ జగమంతా రక్షకుడా నీ జన్మతో
thaaranu chuusina jnyaanulu – cheeriri prabhuni chenthaku bangaaramu saanbraanni boollamunu – arpinchiri bhaya bhakthulathoo gollalu jnyaanulu pillalu peddalu paravishinchiri nee raakathoo aanandamaayenu ee jagamanthaa rakssakudaa nee janmathoo