రారే చూతము రాజసుతుని రేయి
raaree chuuthamu raajasuthuni reeyi
రారే చూతము రాజసుతుని రేయి జనన మాయెను (2) రాజులకు రారాజు మెస్సయ్యా రాజితంబగు తేజమదిగో (2) ||రారే||
raaree chuuthamu raajasuthuni reeyi janana maayenu (2) raajulaku raaraaju messayyaa raajithanbagu theejamadigoo (2) ||raaree||
దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా దేవుడే మన దీనరూపున ధరణి కరిగె-నీ దినమున కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయుల దర్శనం తెల్లగానదే తేజరిల్లెడి తార గాంచరే త్వరగ రారే బాలు-డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు బాల బాలిక బాలవృద్ధుల నేల గల్గిన నాథుడు యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె సదమలంబగు మదిని గొల్చిన సర్వ జనులకు సార్వభౌముడు
duutha gannamulan deeri chuudaree daiva vaakkulan delpagaa deevudee mana deenaruupuna dharanni karige-nee dinamuna kallagaadidi kalayu gaadidi golla booyula darshanam thellagaanadee theejarilledi thaara gaancharee thvaraga raaree baalu-dadugoo veela suuryula boolu sadgunna sheeludu baala baalika baalavruddhula neela galgina naathudu yuudavanshamu nuddharinpa daaveedupuramuna nudbhavinche sadamalanbagu madini golchina sarva janulaku saarvabhaumudu