సాగేను నా జీవ నావ
saageenu naa jeeva naava
సాగేను నా జీవ నావ దొరికేను ఓ ప్రేమ త్రోవ నా యేసు పయనించు దారదీ కల్వరిగిరి చేరే త్రోవదీ ఆ….ఆ….ఆ…. ||సాగేను||
saageenu naa jeeva naava dorikeenu oo preema throova naa yeesu payaninchu daaradee kalvarigiri cheeree throovadee aa….aa….aa…. ||saageenu||
నేనెవరో నేనెరుగని తరుణంలో నా ఉనికిని యేర్పరచిన నాథుడు విశ్వాసపు నా జీవనతీరంలో ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు తన రక్త ధారలను ప్రోక్షించి నా హృదిలో పాపము తొలగించెను అనురాగ రసరమ్య గీతిక నా హృదిలో ప్రేమను వెలిగించెను ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట వాడుటకు మమ్మును బలపరచుము
neenevaroo neenerugani tharunnanloo naa unikini yeerparachina naathudu vishvaasapu naa jeevanatheeranloo preema keratamai vachchenu yeesudu thana raktha dhaaralanu prookssinchi naa hrudiloo paapamu tholaginchenu anuraaga rasaramya geethika naa hrudiloo preemanu veliginchenu prabhu paniloo balamaina yoodhulugaa prathichootanu nammakamugaa undutaku neevichchina thalaanthulanu prathichoota vaadutaku mammunu balaparachumu