సాగిల పడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మాలో
saagila padi mrokkedamu - sathyamuthoo aathmaaloo
సాగిల పడి మ్రొక్కెదము - సత్యముతో ఆత్మాలో మన ప్రభు యేసునీ ఆ..ఆ..ఆ...
saagila padi mrokkedamu - sathyamuthoo aathmaaloo mana prabhu yeesunee aa..aa..aa...
మోసే కంటే శ్రేష్టుడు - అన్ని మోసముల నుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ - ఆశతో మ్రెక్కెదము || సాగిల||
moosee kantee shreesstudu - anni moosamula nundi vidipinchun veessadhaarulanu dveessinchun - aashathoo mrekkedamu || saagila||
అహరోను కంటే శ్రేష్టుడు - మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రదాన యాజకుడు - అందరము మ్రొక్కెదము ||సాగిల||
aharoonu kantee shreesstudu - mana aaraadhanaku paathrundu aayanee pradaana yaajakudu - andaramu mrokkedamu ||saagila||
ఆలయము కన్న శ్రేష్టుడు - నిజ ఆలయముగ తానే యుండెన్ ఆలయము మీరే యనెను - ఎల్ల కాలము మ్రొక్కెదము ||సాగిల||
aalayamu kanna shreesstudu - nija aalayamuga thaanee yunden aalayamu meeree yanenu - ella kaalamu mrokkedamu ||saagila||
యోనా కంటే శ్రేష్టుడు - ప్రాణధానముగా తన్ను అర్పించెన్ మానవులను విమోచించెన్- ఘనపరచి మ్రొక్కెదము ||సాగిల||
yoonaa kantee shreesstudu - praannadhaanamugaa thannu arpinchen maanavulanu vimoochinchen- ghanaparachi mrokkedamu ||saagila||
సొలోమొను కన్న శ్రేష్టుడు - సర్వ జ్ఞానమునకు ఆధారుండు పది వేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము ||సాగిల||
soloomonu kanna shreesstudu - sarva jnyaanamunaku aadhaarundu padi veelaloo athi priyundu - padilamugaa mrokkedamu ||saagila||
రాజుల కంటే శ్రేష్టుడు - యాజకులనుగా మనలను చేసెను రారాజుగ త్వరలో వచ్చున్ - - రయముగను మ్రొక్కెదము ||సాగిల||
raajula kantee shreesstudu - yaajakulanugaa manalanu cheesenu raaraajuga thvaraloo vachchun - - rayamuganu mrokkedamu ||saagila||
అందరిలో అతి శ్రేష్టుడు - మన కందరికి తానే ప్రభువు హల్లేలూయకు పాత్రుండు - అను దినము మ్రొక్కెదము ||సాగిల||
andariloo athi shreesstudu - mana kandariki thaanee prabhuvu halleeluuyaku paathrundu - anu dinamu mrokkedamu ||saagila||