సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
sangeetha naadamuthoo sthoothra sankeerthanathoo
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెద నీ గోప్ప కార్యం చాటెద నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా ||సంగీత||
sangeetha naadamuthoo sthoothra sankeerthanathoo nee preema geetham paadeda nee gooppa kaaryam chaateda naa jeevitham maarchina yeesayyaa ee nee runnam theerchuta etulayyaa ||sangeetha||
నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2) పాపములు క్షమియించి నను మార్చిన దోషములు భరియించి దరిచేర్చిన ||నీ ప్రేమ||
naa katthina hrudayamuna kaarunnyamunu ninpi kaluvalu puuyinchina krupalanu koniyaadeda (2) paapamulu kssamiyinchi nanu maarchina doossamulu bhariyinchi daricheerchina ||nee preema||
నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెద క్షేమమును కలిగించి నను లేపిన దీవెనలు కురిపించి కృపచూపిన నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన
naa kassta samayamuna naa chenthanee nilachi viduvaka nadipinchina vidhamunu vivarincheda ksseemamunu kaliginchi nanu leepina deevenalu kuripinchi krupachuupina naa duhkha dinamulaloo oodaarpu kaliginchi kanneetini thudichina kramamunu prakatincheda vaakyamuthoo darshinchi balaparichina sathyamuthoo sandhinchi sthiraparichina