సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను
sarvashakthuni sthoothragaanamu - salparee jagamellanu
సర్వశక్తుని స్తోత్రగానము - సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము- నిత్యమెద రాజిల్లను
sarvashakthuni sthoothragaanamu - salparee jagamellanu nirvahinchunu daasa bhaaramu- nithyameda raajillanu
ముదముతో నిర్మానకుండగు-మూలకర్తను బాడరే వదన మీక్షాంబ దేవుని - వందనముతో వేడరే ||సర్వశక్తుని స్తోత్రగానము||
mudamuthoo nirmaanakundagu-muulakarthanu baadaree vadana meekssaanba deevuni - vandanamuthoo veedaree ||sarvashakthuni sthoothragaanamu||
వేధ పారాయణము చేయుచు విశ్వమంత జయింపరే సాదరముగ దేవునిక మీ - స్వాంతమున బూజింపరే ||సర్వశక్తుని స్తోత్రగానము||
veedha paaraayannamu cheeyuchu vishvamantha jayinparee saadaramuga deevunika mee - svaanthamuna buujinparee ||sarvashakthuni sthoothragaanamu||
ఎదను విశ్రాంతిన్ బరేశుని - హెచ్చుగా స్తుతి జేయరే సదమలంబగు భక్తితో మీ - సర్వ మాయనకీయరే ||సర్వశక్తుని స్తోత్రగానము||
edanu vishraanthin bareeshuni - hechchugaa sthuthi jeeyaree sadamalanbagu bhakthithoo mee - sarva maayanakeeyaree ||sarvashakthuni sthoothragaanamu||
చావు పుట్టుక లేని వాడుగా - సతతము జీవించును ఈవులిచ్చుచు తన్ను వేడుమ - హేష్టులను రక్షించును ||సర్వశక్తుని స్తోత్రగానము||
chaavu puttuka leeni vaadugaa - sathathamu jeevinchunu eevulichchuchu thannu veeduma - heesstulanu rakssinchunu ||sarvashakthuni sthoothragaanamu||
దాసులై దేవునికి నెదలో - దర్బమును పోగొల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము - నే మరక మైదాల్పరే ||సర్వశక్తుని స్తోత్రగానము||
daasulai deevuniki nedaloo - darbamunu poogolparee yeesukreesthuni punnyavasthramu - nee maraka maidaalparee ||sarvashakthuni sthoothragaanamu||