సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె
sarvoonnatha sthalamulaloo samaadhaanamu praapthinche
సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2) హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత||
sarvoonnatha sthalamulaloo samaadhaanamu praapthinche praja koraku prabhu janmamuthoonu (2) halleluuyaa arpannalu – ullamuthoo chellinthum raajaadhi raajunaku – hoosannaa prabhuvunaku (2) ||sarvoonnatha||
పశువుల పాకలో మనకు శిశువు జన్మించె పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా||
pashuvula paakaloo manaku shishuvu janminche poththiguddalaloo chuttaga pavallinchina thandri aashcharyakarudu – aaloochanakartha nithyundu sathyundu nija rakssanna kreesthu (2) ||halleluuyaa||
మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై మన దోషము బాప – మానవరూపమున జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు
mana vyasanamulanu baapa moththabaduta korakai mana samaadhaanaartha shikssa moopabaduta korakai mana doossamu baapa – maanavaruupamuna janiyinche baalundu immaanuyeelundu