సీయోనులో నుండి నీవు
seeyoonuloo nundi neevu
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2) సమాధానమై – సదాకాలము నను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై సీయోనులో మహోన్నతుడా యేసయ్యా నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకు విడువవు నను యెడబాయవు నీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||
seeyoonuloo nundi neevu – prakaashinchuchunnaavu naapai (2) samaadhaanamai – sadaakaalamu nanu neethoo nadipinchuchunnaavu nee keerthikai seeyoonuloo mahoonnathudaa yeesayyaa nirdoossamaina maargamuloo – naa antharangamuna dhairyamunichchi nee sannidhiloo nanu nilipi – unnatha vijayamunichchithivi nee aashalu neraveerutaku – nee chiththamu jariginchutaku viduvavu nanu yedabaayavu neevu viduvavu nanu yedabaayavu ||seeyoonuloo||
నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొని కీర్తిoచెదను ప్రతినిత్యం నిను ఆరాధింతును అనుక్షణము నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమును మరువను ఎన్నడు విడువను నేను మరువను ఎన్నడు విడువను
naayandu drussti nilipi – nee sneehabandhamuthoo aakarssinchi krupaavaramulathoo nanu ninpi – sathyasaakssigaa maarchithivi nee manassunu pondukoni – nee preemanu ninpukoni keerthiochedanu prathinithyam ninu aaraadhinthunu anukssannamu nee divyamaina mahimanu – paralookamandunee chuuchedanu nee kaugililoo cheerchukoni – prathi bhaasspabinduvunu thudichedavu nee maatala makarandamunu – marapuraani anubandhamunu maruvanu ennadu viduvanu neenu maruvanu ennadu viduvanu