శ్రమయైనా బాధైనా – హింసలెన్ని
shramayainaa baadhainaa – hinsalenni
శ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2) సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు? శౌర్యుడు ధీరుడు వీరుడు శూరుడు యోగ్యుడు శ్రేష్ఠుడు అర్హుడు ఘనుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు – సర్వము చేసిన సృష్టికర్త మహోన్నతుడు మహేశ్వరుడు – సర్వము గెలిచిన సర్వేశ్వరుడు దేవాది దేవుడు రాజాధి రాజు – ప్రభువుల ప్రభువు నిత్య దేవుడు విశ్వాసమే నా బలము – నిత్యజీవము చేపట్టుటే నా భాగ్యము శ్రమలేలేని బాధేలేని – ఆ లోకంలో నిరంతరం జీవింతును విమోచకుడు సజీవుడు – నా కనులారా నే చూచెదను యుగయుగములకు మహారాజునితో – పాలించుటకే పోరాడెదను ఓ క్రైస్తవా సోలిపోకుమా – తీర్పు నుండి నీ ఆత్మను తప్పించుకో మోసపోకుమా జారిపోకుమా – నీ రక్షణన్ జాగ్రత్తగా కాపాడుకో మంచి పోరాటం నువ్వు పోరాడు – నీ పరుగునే కడముట్టించు విశ్వాసమును కాపాడుము – యేసుని చేర వెయ్యి ముందడుగు ||శ్రమయైనా||
shramayainaa baadhainaa – hinsalenni edurainaa kreesthu preema nundi nannu eedee edabaayadu khadgamee edurainaa – shoodhanalu edurainaa naa raaju vachchuchunnaadu – bheekarudai vachchuchunnaadu – (2) sarvoonnathudu meeghaaruuddhigaa – theerpunu theercha raanunnaadu edureeleeni kodamasinham – mahaa ugrathathoo raanunnaadu evaru? evaru? evaru? evaru? evaru? evaru?evaru? evaru? shauryudu dheerudu veerudu shuurudu yoogyudu shreesstthudu arhudu ghanudu adbhuthakarudu aashcharyakarudu – sarvamu cheesina srusstikartha mahoonnathudu maheeshvarudu – sarvamu gelichina sarveeshvarudu deevaadi deevudu raajaadhi raaju – prabhuvula prabhuvu nithya deevudu vishvaasamee naa balamu – nithyajeevamu cheepattutee naa bhaagyamu shramaleeleeni baadheeleeni – aa lookanloo nirantharam jeevinthunu vimoochakudu sajeevudu – naa kanulaaraa nee chuuchedanu yugayugamulaku mahaaraajunithoo – paalinchutakee pooraadedanu oo kraisthavaa soolipookumaa – theerpu nundi nee aathmanu thappinchukoo moosapookumaa jaaripookumaa – nee rakssannan jaagraththagaa kaapaadukoo manchi pooraatam nuvvu pooraadu – nee parugunee kadamuttinchu vishvaasamunu kaapaadumu – yeesuni cheera veyyi mundadugu ||shramayainaa||