సిలువలో నీ ప్రేమ
siluvaloo nee preema
సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2) ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2) ||సిలువలో||
siluvaloo nee preema – paapamu theeseenayyaa marannamu cheraloo nundi – nanu vidipincheenayyaa (2) ghoora paapini neenu – parishuddhuni cheesithivi nithyajeevamuloo nannu – niluputaku bali ayithivi (2) ||siluvaloo||
తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం నను విడిపించుటకు – విలువను విడిచితివి పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2) ||ఘోర పాపిని||
thaallaleeni nee thaapam – tholaginchenu naadu shaapam naliginatti nee ruupam – ichcheenu naaku svaruupam nanu vidipinchutaku – viluvanu vidichithivi paramunu cheerchutaku – mahimanu marichithivi (2) ||ghoora paapini||
దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి మరణము దాటుటకు – బలిగా మారితివి అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము నిను చాటించుటకు – వెలుగై సాగెదను ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను
daiva thanayuni deeham – moosindi cheeyani neeram kadigeenduku naa doossam – chindinche niluvunaa rudhiram nanu kaapaadutaku – rottegaa virigithivi marannamu daatutaku – baligaa maarithivi adhamudayinatti neenu – nee preema arhudanu kaanu pogidi ninnu prathi kssannamu – theerchaleenu nee runnamu ninu chaatinchutaku – velugai saagedanu preemanu panchutakai – uppuga nilichedanu