సృష్టి కర్తా యేసు దేవా
srussti karthaa yeesu deevaa
సృష్టి కర్తా యేసు దేవా సర్వ లోకం నీ మాట వినును (2) సర్వ లోక నాథా సకలం నీవేగా సర్వ లోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అను నిత్యము ||సృష్టి||
srussti karthaa yeesu deevaa sarva lookam nee maata vinunu (2) sarva looka naathaa sakalam neeveegaa sarva looka raajaa sarvamu neeveegaa sannuthinthunu anu nithyamu ||srussti||
కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షా రసము చేసి కనలేని అంధులకు చూపు నొసగి చెవిటి మూగల బాగు పరచితివి నీకసాధ్యమేదీ లేనే లేదు ఇలలో ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు ||సర్వ||
kaanaan vivaahamuloo adbhuthamugaa neetini draakssaa rasamu cheesi kanaleeni andhulaku chuupu nosagi cheviti muugala baagu parachithivi neekasaadhyameedee leenee leedu ilaloo aashcharyakarudaa goppa deevudavu ||sarva||
మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివే
mruthula sahithamu jeevinpajeesi mruthini gelichi thirigi leechithivi nee raajyamuloo neethoo vasinpa konipoova thvaraloo raanuntivee