సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన
srusstikarthavaina yehoovaa nee cheethipaniyaina
సృష్టికర్తవైన యెహోవా నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ మంటికి రూపమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్స్వార్ధ్యమైన నీ ప్రేమా మరణము కంటె బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన||
srusstikarthavaina yehoovaa nee cheethipaniyaina naapai endukintha preema mantiki ruupamichchinaavu mahimaloo sthaanamichchinaavu naaloo ninnu chuusaavu neeloo nannu daachaavu nissvaardhyamaina nee preemaa marannamu kante balamainadi nee preema ||srusstikarthavaina||
ఏ కాంతి లేని నిశీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో ఎన్నో అపాయపు అంచులలో నన్నాదుకున్న నా కన్న తండ్రివి (2) యేసయ్యా నను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన||
ee kaanthi leeni nisheedhiloo ee thoodu leeni vissaadapu veedhulaloo ennoo apaayapu anchulaloo nannaadukunna naa kanna thandrivi (2) yeesayyaa nanu anaathagaa viduvaka neelaanjanamulathoo naaku punaadulu veesithivi (2) ||srusstikarthavaina||
నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి నన్నాకర్షించిన ప్రేమమూర్తివి యేసయ్యా నను కృపతో బలపరచి ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి
nissaaramaina naa jeevithamuloo nittuurpulu nannu dinamella veedinchagaa nashinchipoothunna nannu vedaki vachchi nannaakarssinchina preemamuurthivi yeesayyaa nanu krupathoo balaparachi ullaasa vasthramunu naaku dharinpajeesithivi