స్తోత్రించెదము దైవకుమారుని – నూతన
sthoothrinchedamu daivakumaaruni – nuuthana
స్తోత్రించెదము దైవకుమారుని – నూతన జీవముతో (2) నిరంతరము మారని రాజును – ఘనంబు చేయుదము యేసు మా రక్షకుడు – కల్మషము లేనివాడు సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయ భయంకరమైన భీతిని గొల్పెడు – జిగట ఊబినుండి బలమైన హస్తముతో నన్ను ఎత్తి – బండపై స్థిరపరచెన్ (2) ||యేసు||
sthoothrinchedamu daivakumaaruni – nuuthana jeevamuthoo (2) nirantharamu maarani raajunu – ghananbu cheeyudamu yeesu maa rakssakudu – kalmassamu leenivaadu samasthamunu kaligina yeesu prabhunakee halleluuya bhayankaramaina bheethini golpedu – jigata uubinundi balamaina hasthamuthoo nannu eththi – bandapai sthiraparachen (2) ||yeesu||
కనుపాపగ నను కాయు ప్రభుండు – కునుకడు నిద్రించడు తనచేతిలో ననుచెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము తల్లిదండ్రియు యెడబాసినను – విడువక కాయును ఎల్లప్పుడు నేను భజియించెదను – వల్లభుడేసు ప్రభున్ ఆత్మీయ పోరాటమునకు ప్రభువు – ఆత్మశక్తినిచ్చెన్ స్తుతియు నీకే ఘనతయు నీకే – యుగయుగములలోన
kanupaapaga nanu kaayu prabhundu – kunukadu nidrinchadu thanacheethiloo nanuchekkina prabhuvunu cheeri sthuthinchedamu thallidandriyu yedabaasinanu – viduvaka kaayunu ellappudu neenu bhajiyinchedanu – vallabhudeesu prabhun aathmeeya pooraatamunaku prabhuvu – aathmashakthinichchen sthuthiyu neekee ghanathayu neekee – yugayugamulaloona