స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు
sthuthi prashansa paaduchu keerthinthu
స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు నిత్యము (2) మహా రక్షణ నిచ్చియు మనశ్శాంతి నిచ్చెను పాపలోక బంధమందు దాసత్వమందుండ నీ రక్తశక్తిచే ప్రభు విమోచించితివి (2) ||స్తుతి ప్రశంస||
sthuthi prashansa paaduchu keerthinthu nithyamu (2) mahaa rakssanna nichchiyu manashshaanthi nichchenu paapalooka bandhamandu daasathvamandunda nee rakthashakthichee prabhu vimoochinchithivi (2) ||sthuthi prashansa||
పాప భారముచే నేను దుఃఖము పొందితి నా ప్రభువే భరించెను నా దుఃఖ బాధలు హృదయాంధకారముచే నేను దారి తొలగితి ప్రభువే జ్యోతి యాయెను సత్యమార్గము చూపె పెంటకుప్పనుండి నన్ను లేవనెత్తితివి దరిద్రుడనైన నన్ను రాజుగా జేసితివి
paapa bhaaramuchee neenu duhkhamu pondithi naa prabhuvee bharinchenu naa duhkha baadhalu hrudayaandhakaaramuchee neenu daari tholagithi prabhuvee jyoothi yaayenu sathyamaargamu chuupe pentakuppanundi nannu leevaneththithivi daridrudanaina nannu raajugaa jeesithivi