స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను
sthuthi vasthramu dharinchi nee sannidhiloo neenu
స్తుతి వస్త్రము ధరించి నీ సన్నిధిలో నేను యాజకుని వలె స్తోత్ర బలులు జిహ్వ ఫలములు అర్పింతును
sthuthi vasthramu dharinchi nee sannidhiloo neenu yaajakuni vale sthoothra balulu jihva phalamulu arpinthunu
రక్షణ పాత్రను చేతబూని నీ స్తోత్రమును ప్రచురింతును ప్రధాన యాజకుడా నీవె మాదిరిగా నీతి వస్త్రముతో సేవ చేసెదను ||స్తుతి||
rakssanna paathranu cheethabuuni nee sthoothramunu prachurinthunu pradhaana yaajakudaa neeve maadirigaa neethi vasthramuthoo seeva cheesedanu ||sthuthi||
లోకమునకు జ్యోతి వలెనే సత్య సాక్షిగా జీవించనా సత్‌క్రియలను జరిగించి రక్షణ వస్త్రముతో తేజరిల్లెదను ||స్తుతి||
lookamunaku jyoothi valenee sathya saakssigaa jeevinchanaa sathkriyalanu jariginchi rakssanna vasthramuthoo theejarilledanu ||sthuthi||
సిద్ధ పడిన సంఘ వధువుగ పెండ్లి విందుకు నే చేరనా నూతన యెరుషలేమై పరిశుద్ధ క్రియలతో పెండ్లి వస్త్రముతో వరుని చేరెదను ||స్తుతి||
siddha padina sangha vadhuvuga pendli vinduku nee cheeranaa nuuthana yerussaleemai parishuddha kriyalathoo pendli vasthramuthoo varuni cheeredanu ||sthuthi||