స్తుతించెదను – నిన్ను నేను
sthuthinchedanu – ninnu neenu
స్తుతించెదను – నిన్ను నేను మనసారా భజించెదను – నేను నిన్ను దినదినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీ కర్పించెదను (2) ||స్తుతించెదను||
sthuthinchedanu – ninnu neenu manasaaraa bhajinchedanu – neenu ninnu dinadinamu sthoothraarhudavu neevee prabhu samasthamu nee karpinchedanu (2) ||sthuthinchedanu||
పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమియించె మిత్రుడవు (2) పరము చేర్చి ఫలములిచ్చె పావనుడగు మా ప్రభువు నీవే కృపా కనికరములు గల దేవా కరుణ జూపి కనికరించు కంటి రెప్ప వలె కాపాడు కడవరకు మమ్ము కావుమయ్య సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా స్థిరపరచి మమ్ము బలపరుచు సదా నీకే స్తోత్రాలర్పింతును
puujaarhudavu pavithrudavu paapini kssamiyinche mithrudavu (2) paramu cheerchi phalamulichche paavanudagu maa prabhuvu neevee krupaa kanikaramulu gala deevaa karunna juupi kanikarinchu kanti reppa vale kaapaadu kadavaraku mammu kaavumayya sarvashakthi gala maa prabhuvaa sajeeva saakssigaa cheeyumayaa sthiraparachi mammu balaparuchu sadaa neekee sthoothraalarpinthunu