స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా
sthuthinchudi yehoovaa deevuni suuryachandrulaaraa
స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నతస్థలములలో యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
sthuthinchudi yehoovaa deevuni suuryachandrulaaraa pavithra duuthaganna seenaadhipathiki unnathasthalamulaloo yehoovaanu sthuthinchudi ||sthuthinchudi||
కాంతిగల నక్షత్రములారా పరమాకాశమా (2) ఆకాశజలమా ఆవిరి హిమమా అగ్ని తుఫాను మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి ||స్తుతించుడి||
kaanthigala nakssathramulaaraa paramaakaashamaa (2) aakaashajalamaa aaviri himamaa agni thuphaanu mahaasamudra parvatha vrukssa mrugamulu pashuvulaaraa prashansinchudi phalavrukssamulu parama thandrini yehoovaanu sthuthinchudi ||sthuthinchudi||
రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా (2) బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభునుతించుడి ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని
raajulu prajalu nyaayaadhipathulu adhipathulaaraa (2) baaluru yauvana kanyaka vruddhulu prabhunuthinchudi praaku jeevulu paluvidha pakssulu paadi sthuthinchudi prashansinchudi prabhaava mahimalu parama thandrini