స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా
sthuthulapai aaseenudaa athyunnatha naa
స్తుతులపై ఆసీనుడా అత్యున్నత నా దేవుడా (2) నీ ప్రేమలో నీ ప్రేమలో నను నేను మరిచాను నీ ప్రేమలో నీ నీడలో నీ జాడలో మైమరచిపోయాను నేను ||స్తుతులపై||
sthuthulapai aaseenudaa athyunnatha naa deevudaa (2) nee preemaloo nee preemaloo nanu neenu marichaanu nee preemaloo nee needaloo nee jaadaloo maimarachipooyaanu neenu ||sthuthulapai||
నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు నీవు పొందిన గాయాలకు బదులు (2) బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు వెండినడుగలేదు నీవు విరిగి నలిగి – కరిగి వెలిగే హృదయాన్నే కోరావు నీవు (2) ఓ మాట సెలవియ్యి దేవా నీ పాద ధూళిని కానా ప్రభువా నీ పాదం స్పర్శించగానే నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||
neevu cheesina aashcharya kaaryaalaku badulu neevu pondina gaayaalaku badulu (2) bangaaram vajraalu – makutaalu kireetaalu vendinadugaleedu neevu virigi naligi – karigi veligee hrudayaannee kooraavu neevu (2) oo maata selaviyyi deevaa nee paada dhuullini kaanaa prabhuvaa nee paadam sparshinchagaanee naa santhoossaaniki haddundunaa ||sthuthulapai||
నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు మా బ్రతుకులో విజయము మొదలు (2) మరణం అనేటి ముల్లును విరచి తిరిగి లేచావు నీవు చీకటి నిండిన మాదు బ్రతుకులో వెలుగులు నింపావు నీవు (2) నీకోసం ఏదైనా దేవా నే వెచ్చింప సంసిద్ధమయ్యా ఆఖరికి నా ప్రాణమైనా చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||
neevu leechina punaruththaanaa dinamu modalu maa brathukuloo vijayamu modalu (2) marannam aneeti mullunu virachi thirigi leechaavu neevu cheekati nindina maadu brathukuloo velugulu ninpaavu neevu (2) neekoosam eedainaa deevaa nee vechchinpa sansiddhamayyaa aakhariki naa praannamainaa chindulu veesthuu arpisthaa ||sthuthulapai||