సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా
sundaramaina deehaalennoo shithilam kaaleedaa
సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదా? అంబరమంటిన రాజులెందరో అలిసిపోలేదా? కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా? ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా? ఏదీ శాశ్వతం కాదేది శాశ్వతం తరచి చూడుము పరికించి చూడము (2) ||సుందరమైన||
sundaramaina deehaalennoo shithilam kaaleedaa? anbaramantina raajulendaroo alisipooleedaa? kalamulu pattina kavulu endaroo kanumarugavaleedaa? dharanniloona dhanikulellaru dahanam kaaleedaa? eedee shaashvatham kaadeedi shaashvatham tharachi chuudumu parikinchi chuudamu (2) ||sundaramaina||
నెత్తుటి చారలను లిఖించిన రాజులెందరో ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు సమాధి లోతుల్లోనే మూగబోయారు (2) తపోబలము పొందిన ఋషులందరూ మతాధికారులు మఠాధిపతులు ఈ కాలగర్భంలోనే కలసిపోయారు మరణ పిడికళ్లలో బందీలయ్యారు యేసులేని జీవితం వాడబారిన చరితం క్రీస్తు ఉన్న జీవితం భువిలో చరితార్ధం ప్రాణం పోసిన దైవాన్ని కాదంటే ఆ జీవితానికి పరమార్ధం ఉంటుందా? పాప సంకెళ్ళలో బందీలైనవారికి ఆ దివ్య మోక్షం చేరుకొనే భాగ్యం ఉంటుందా? శరీరాన్ని విడిచిన మనుష్యాత్మకు మరో జీవితం లేదనుట భావ్యమా? రక్తము కార్చిన యేసుని విస్మరించి ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా? యేసులేని జీవితం అంధకార భందురం క్రీస్తు ఉన్న జీవితం తేజోమయ మందిరం
neththuti chaaralanu likhinchina raajulendaroo aa neththuruloonee praannaalu vidichipooyaaru adhikaara daahanthoo madamekkina veerulu samaadhi loothulloonee muugabooyaaru (2) thapoobalamu pondina russulandaruu mathaadhikaarulu matthaadhipathulu ee kaalagarbhanloonee kalasipooyaaru maranna pidikalllaloo bandeelayyaaru yeesuleeni jeevitham vaadabaarina charitham kreesthu unna jeevitham bhuviloo charithaardham praannam poosina daivaanni kaadantee aa jeevithaaniki paramaardham untundaa? paapa sankellllaloo bandeelainavaariki aa divya mookssam cheerukonee bhaagyam untundaa? shareeraanni vidichina manussyaathmaku maroo jeevitham leedanuta bhaavyamaa? rakthamu kaarchina yeesuni vismarinchi ee srusstini puujinchuta manissiki nyaayamaa? yeesuleeni jeevitham andhakaara bhanduram kreesthu unna jeevitham theejoomaya mandiram