సుందరములు అతి సుందరములు సువార్త
sundaramulu athi sundaramulu suvaartha
సుందరములు అతి సుందరములు సువార్త మోసిన పాదములు అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2) ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2) ||ఏ లేమికి||
sundaramulu athi sundaramulu suvaartha moosina paadamulu athi shreesstthulu enthati dhanyulu prabhu preemanu chaatina pedavulu (2) ee leemiki kalatha chendaru – ee nalathaku thalalu vancharu prabhu seevaloo dheerulu veeru – thana chiththamu erigina vaaru yeesunu preeminchi vaaru dveessanamuku guri ayinaaru jeevamunu chaatinchutakai marannaaniki bali ayinaaru thama siluvanu eththukoni – prabhu boodhanu paatinchaaru prabhu chiththamu neraveerchi – thana sannidhinee cheeraaru (2) ||ee leemiki||
లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు
lookamu cheekati baaputaku velugulu vedajallina vaaru thama paadaalaku prabhu vaakyamu deepamugaa veliginchaaru thama deehamu yaagamugaa – shoodhanalu jayinchinaaru thama saakssyamu penchukoni – prabhu rakssannanu panchaaru