సూడ సక్కని బాలుడమ్మో బాలుడు
suuda sakkani baaludammoo baaludu
సూడ సక్కని బాలుడమ్మో బాలుడు కాడు మన దేవుడమ్మో (2) కన్య మరియ గర్భమున ఆ పరిశుద్ధ స్థలమున మనకై జన్మించినాడు మనలను రక్షించినాడు (2) ||సూడ||
suuda sakkani baaludammoo baaludu kaadu mana deevudammoo (2) kanya mariya garbhamuna aa parishuddha sthalamuna manakai janminchinaadu manalanu rakssinchinaadu (2) ||suuda||
బేత్లెహేము పురమందున – లోక రక్షకుడు పుట్టెను లోకానికి వెలుగై – మనకు కాపరిగా నిలిచెను ఆ జ్ఞానములు ప్రధానులు నా ప్రభుని మ్రొక్కెను ఆ దూతలు గొల్లలు క్రొత్త కీర్తనలు పాడెను సంతోషించి స్తుతియించి కీర్తించి ఘనపరచి పరవశించ సాగెను మన చీకటిని తొలగించి – వెలుగుతో నింపెను మన పాపాన్ని క్షమియించి – పవిత్రులుగా మార్చెను పరిశుద్ధుడు పరమాత్ముడు మా శాంతి స్వరూపుడు మహనీయుడు మహోన్నతుడు మా లోక రక్షకుడు దివి నుండి భువిపైకి దిగి వచ్చి మానవులను ప్రేమించెను
beethleheemu puramanduna – looka rakssakudu puttenu lookaaniki velugai – manaku kaaparigaa nilichenu aa jnyaanamulu pradhaanulu naa prabhuni mrokkenu aa duuthalu gollalu kroththa keerthanalu paadenu santhoossinchi sthuthiyinchi keerthinchi ghanaparachi paravashincha saagenu mana cheekatini tholaginchi – veluguthoo ninpenu mana paapaanni kssamiyinchi – pavithrulugaa maarchenu parishuddhudu paramaathmudu maa shaanthi svaruupudu mahaneeyudu mahoonnathudu maa looka rakssakudu divi nundi bhuvipaiki digi vachchi maanavulanu preeminchenu