తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును
thallilaa laalinchunu thandrilaa preeminchunu
తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2) ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||
thallilaa laalinchunu thandrilaa preeminchunu (2) mudimi vachchuvaraku eththukoni muddaadunu chanka pettukoni kaapaadunu yeesayyaa ||thallilaa||
తల్లియైన మరచునేమో - నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో - నిన్ను చెక్కియున్నాను (2) నీ పాదము త్రొట్రిల్లనీయను నేను నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా ||తల్లిలా||
thalliyaina marachuneemoo - neenu ninnu maruvanu chuudumu naa aracheethulaloo - ninnu chekkiyunnaanu (2) nee paadamu throtrillaneeyanu neenu ninnu kaapaaduvaadu kunukadu nidurapoodu anicheppi vaagdaanamu cheesina yeesayyaa ||thallilaa||
పర్వతాలు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నాకృప నీకు - నానిబంధనా తొలగదు (2) దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదా నీదుభారమంతా మోసి నాదు శాంతినొసగెదా అనిచెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా ||తల్లిలా||
parvathaalu tholagavachchu - thaththarillu mettalannee veedipoodu naakrupa neeku - naanibandhanaa tholagadu (2) digulupadaku bhayapadaku ninnu vimoochinchedaa needubhaaramanthaa moosi naadu shaanthinosagedaa anicheppi vaagdaanamu cheesina yeesayyaa ||thallilaa||