ఉతక మీద తలుపు తిరుగు
uthaka meeda thalupu thirugu
ఉతక మీద తలుపు తిరుగు రీతిగా తన పడక మీద సోమరి తిరుగాడును గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి తిరుగును సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2) జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక||
uthaka meeda thalupu thirugu reethigaa thana padaka meeda soomari thirugaadunu gaanuga chutteddu thirugu reethigaa soomari chuttuu leemi thirugunu soomaree meelukoo… veekuvanee leechi praardhinchukoo.. (2) jnyaanamuthoo nee brathukunu maarchukoo prabhu yeesuni nee madiloo cheerchukoo (2) ||uthaka||
చిన్న జీవులు చీమలు చూడు వాటికి ఏలిక లేనే లేదు అయినను అవి క్రమము గానే నడచును వేసవిలో ఆహారము కూర్చును (2) ||సోమరీ||
chinna jeevulu cheemalu chuudu vaatiki eelika leenee leedu ayinanu avi kramamu gaanee nadachunu veesaviloo aahaaramu kuurchunu (2) ||soomaree||
చిన్న కుందేళ్ళను చూడు ఏ మాత్రము బలము లేని జీవులు పేరు సందులలో జీవించును బంధకములు లేనివై తిరుగును చిన్న జీవులు మిడతలు చూడు వాటికి న్యాయాధిపతి లేడుగా పంక్తులుగా తీరి సాగి పోవును జ్ఞానము గల వానిగ పేరొందును తెల్లవారుచుండగనే పక్షులు కిలకిలమని దేవుని స్తుతియించును బ్రతుకు తెరువు కోసమై తిరుగును ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2) ||సోమరీ||
chinna kundeellllanu chuudu ee maathramu balamu leeni jeevulu peeru sandulaloo jeevinchunu bandhakamulu leenivai thirugunu chinna jeevulu midathalu chuudu vaatiki nyaayaadhipathi leedugaa pankthulugaa theeri saagi poovunu jnyaanamu gala vaaniga peerondunu thellavaaruchundaganee pakssulu kilakilamani deevuni sthuthiyinchunu brathuku theruvu koosamai thirugunu prodduguuku veellaloo guudu cheerunu (2) ||soomaree||
ఓ మానవుడా నీ మనసును మార్చుకో ఎందుకో నీ పయనము తెలుసుకో ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2) ||సోమరీ||
oo maanavudaa nee manasunu maarchukoo endukoo nee payanamu thelusukoo prabhu raakada eppudoo adi theliyadu anthamochchum kaalamokkatunnadi (2) ||soomaree||