వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది
vachchindi krismas vachchindi thechchindi
వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరూ వాడా పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే (2) మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది||
vachchindi krismas vachchindi thechchindi panduga thechchindi thechchindi rakssanna thechchindi uuruu vaadaa palle pallelloona aanandamee enthoo santhoossamee (2) mana cheekati brathukulaloona prabhu yeesu janminchenu raarandooy veeduka cheeddaam kalisi raarandooy panduga cheeddaam (2) ||vachchindi||
దావీదు పట్టణములో బేత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను అంధకారమే తొలగిపోయెను చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి||
daaveedu pattannamuloo beethleheemu graamamuloo kanya mariya garbhamunandu baalunigaa janminchenu andhakaaramee tholagipooyenu cheeku chinthalee theeripooyenu (2) ||mana cheekati||
ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు
aakaashanloo oka duutha palikindi shubhavaartha mana koraku rakssakudeesu deenunigaa puttaadani paapa shaapamee tholaginchutaku goppa rakssanna manakichchhutaku