వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
vedakudi vedakudi - yehoovaanu vedakudi
వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి సమయముండగనే – ఆయనను వెదకుడి కృపకాలముననే ఆయనను వెదకుడి (2) ||వెదకు||
vedakudi vedakudi - yehoovaanu vedakudi samayamundaganee – aayananu vedakudi krupakaalamunanee aayananu vedakudi (2) ||vedaku||
ఆయన మీకు - దొరుకు కాలమున నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా నీపై జాలితో - నిన్ను క్షమియించును (2) తరుణము పోయినా- మరల రాదు (2) ||వెదకు||
aayana meeku - doruku kaalamuna nee puurnna hrudayamuthoo - aayananu vedakinaa neepai jaalithoo - ninnu kssamiyinchunu (2) tharunnamu pooyinaa- marala raadu (2) ||vedaku||
తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును (2) తరుణము పోయినా - మరల రాదు (2) ||వెదకు||
thellavaaru jaamuna - nee kanttha svaramuthoo upavaasamuthoo - kanneeti praarthanathoo yehoovaanu vedakina - mookssamu dorukunu (2) tharunnamu pooyinaa - marala raadu (2) ||vedaku||
బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి మగ్ధలేని మరియ - యేసుని వెదికెను కన్నీటితో హన్నా - దేవుని వెదికెను (2) తరుణము పోయినా - మరల రాదు (2) ||వెదకు||
baaludaina yeesuni - jnyaanulu vedikiri magdhaleeni mariya - yeesuni vedikenu kanneetithoo hannaa - deevuni vedikenu (2) tharunnamu pooyinaa - marala raadu (2) ||vedaku||
హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే ఎస్తేరు వెదకి - తన వారిన్ రక్షించే దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు (2) తరుణము పోయినా - మరల రాదు ||వెదకు||
hijkiya vedaki - aayussu sanpaadinchee estheeru vedaki - thana vaarin rakssinchee deevunini namminavaaree – aayananu sthuthiyinthuru (2) tharunnamu pooyinaa - marala raadu ||vedaku||