వినరండి నా ప్రియుని విశేషము
vinarandi naa priyuni visheessamu
వినరండి నా ప్రియుని విశేషము… వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2) నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
vinarandi naa priyuni visheessamu… vinarandi naa priyuni visheessamu naa priyudu (varudu) sundarudu mahaa ghanudu (2) naa priyuni needaloo cheerithini preemaku ruupamu chuusithini aaha enthoo manasanthaa ika aanandamee thanuvanthaa pulakinchi mahadaanandamee ||vinarandi||
మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసె చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే నా ప్రేమను ప్రియునికి తెలిపెదను కన్నీరు తుడిచేది నా ప్రభువే జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు స్తుతినే వస్త్రముగా ధరించుకొని కృపన్ జయధ్వనితో కీర్తించెదను నా ప్రభు యేసు చెంతన చేరెదను యుగమొక క్షణముగ జీవింతును తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచె శుద్ధ హృదయాల వీరులతో ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను ఆ శుభవేళ నాకెంతో ఆనందమే నా ప్రియుని విడువను నేనెన్నడు
mahimathoo nindina veedhulaloo buuralu mroogee aakaasha pandiriloo jathagaa cheeredanu aa sannidhiloo kurise chirujallai preemaamruthamu naa priya yeesu nanu chuusi dari cheerunee naa preemanu priyuniki thelipedanu kanneeru thudicheedi naa prabhuvee jagathiki ruupamu leenappudu koorenu nannu thana koraku naa prabhuvu sthuthinee vasthramugaa dharinchukoni krupan jayadhvanithoo keerthinchedanu naa prabhu yeesu chenthana cheeredanu yugamoka kssannamuga jeevinthunu thalapula prathi malupu gelupulathoo niliche shuddha hrudayaala veerulathoo phalamu prathiphalamu nee pondukoni priya yeesu raajyamuloo nee nilichedanu aa shubhaveella naakenthoo aanandamee naa priyuni viduvanu neenennadu