వినరే యో నరులారా
vinaree yoo narulaaraa
వినరే యో నరులారా – వీనుల కింపు మీర మనల రక్షింప క్రీస్తు – మానుజావతారుడయ్యె – వినరే అనుదినమును దే-వుని తనయుని పద వనజంబులు మన-మున నిడికొనుచును ||వినరే||
vinaree yoo narulaaraa – veenula kinpu meera manala rakssinpa kreesthu – maanujaavathaarudayye – vinaree anudinamunu dee-vuni thanayuni pada vanajanbulu mana-muna nidikonuchunu ||vinaree||
నర రూపు బూని ఘోర – నరకుల రారమ్మని దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు కర మరు దగు క-ల్వరి గిరి దరి కరి గి రయంబున ప్రభు – కరుణను గనరే ఆనందమైన మోక్ష-మందరి కియ్య దీక్ష బూని తన మేని సిలువ – మ్రాను నణచి మృతి బొందెను దీన దయా పరు-డైన మహాత్ముడు జానుగ యాగము – సలిపిన తెరంగిది ఇల మాయావాదుల మాని – యితడే సద్గురు డని తలపోసి చూచి మతి ని-శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు-ములనలరెడు ధని కుల కందని సుఖ-ములు మరి యొసఁగును దురితము లణప వచ్చి – మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుం-దర మందిరమున కరుదుగ జనె బిరబిర మన మం-దర మా కరుణా శరనిధి చరణ మె – శరణని పోదము
nara ruupu buuni ghoora – narakula raarammani durithamu baapu dodda – dorayau mariyaa varaputhrudu kara maru dagu ka-lvari giri dari kari gi rayanbuna prabhu – karunnanu ganaree aanandamaina mookssa-mandari kiyya deekssa buuni thana meeni siluva – mraanu nannachi mruthi bondenu deena dayaa paru-daina mahaathmudu jaanuga yaagamu – salipina therangidi ila maayaavaadula maani – yithadee sadguru dani thalapoosi chuuchi mathi ni-shchala bhakthini golichina vaariki nila janulaku galu-mulanalaredu dhani kula kandani sukha-mulu mari yosamgunu durithamu lannapa vachchi – marannamai thirigi leechi niratha mookssaananda sum-dara mandiramuna karuduga jane birabira mana mam-dara maa karunnaa sharanidhi charanna me – sharannani poodamu