యేసయ్య మాట విలువైన మాట
yeesayya maata viluvaina maata
యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా సోదరా వినిపించుకోవా సోదరీ (2) నీ గుండెలోన ముద్రించుకోవా ఏ నాటికైనా గమనించలేవా గమనించుము పాటించుము ప్రచురించుము నిన్నూవలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య||
yeesayya maata viluvaina maata vinipinchukoovaa soodaraa vinipinchukoovaa soodaree (2) nee gundeloona mudrinchukoovaa ee naatikainaa gamaninchaleevaa gamaninchumu paatinchumu prachurinchumu ninnuuvale nee poruguvaarini preeminchamani preeminchamani ||yeesayya||
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని
aathmavissayamai deenulaina vaaru dhanyulani cheppina maata neethivissayamai aakaligonuvaaru dhanyulani cheppina maata kanikaramu galavaaru – hrudayashuddi galavaaru samaadhaanapaduvaaru – saathvikulu dhanyulani duhkhapaduvaaru dhanyulani cheppina maata narahanthakulu koopapaduvaaru narakaagniki loonagudurani apahaarakulu vyabhicharinchuvaaru narakamuloo padipoodurani kudichenpa ninu kodithee – edama chenpa chuupumani appadugagooruvaariki nee mukhamu thrippakumu nee shathruvulanu dveessinchaka preeminchamani