యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు
yeesayyaa kanikarapuurnnudaa manoohara preemaku
యేసయ్యా కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా (2) నీవే నా సంతోష గానము సర్వ సంపదలకు ఆధారము (2) ||యేసయ్యా||
yeesayyaa kanikarapuurnnudaa manoohara preemaku nilayudaa (2) neevee naa santhoossa gaanamu sarva sanpadalaku aadhaaramu (2) ||yeesayyaa||
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి అలసిన వారి ఆశను తృప్తిపరచితివి అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము నీ వలన బలమునొందిన వారే ధన్యులు నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు (4) ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు
naa valana eediyu aashinchakayee preeminchithivi nanu rakssinchutaku unnatha bhaagyamu vidachithivi siluva mraanupai rakthamu kaarchi rakssinchithivi shaashvatha krupa pondi jeevinthunu ila nee korakee naa koraku sarvamu dhaaraallamugaa dayacheeyuvaadavu daahamu theerchutaku bandanu cheelchina upakaarivi alasina vaari aashanu thrupthiparachithivi anantha krupapondi aaraadhinthunu anukssannamu nee valana balamunondina vaaree dhanyulu nee sannidhi ayina seeyoonuloo vaaru nilichedaru niluvaramaina raajyamuloo ninu chuuchutaku nithyamu krupapondi seevinchedanu thudivaraku aaraadhanaku yoogyudavu ellaveellalaa puujyudavu (4) ellaveellalaa puujyudavu aaraadhanaku yoogyudavu