యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా
yeesu deevuni aashrayinchumaa soodaraa
యేసు దేవుని ఆశ్రయించుమా సోదరా సోదరీ ఈ క్షణమే విశ్వసించుమా తండ్రిని వేడుమా గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా? యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన రోగియైన దాసుని కొరకు శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను మాట మాత్రం సెలవిమ్మనగా విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును (2) యేసు నందు విశ్వాసముంచుము (2) ||యేసు నామములోనే||
yeesu deevuni aashrayinchumaa soodaraa soodaree ee kssannamee vishvasinchumaa thandrini veedumaa goppakaaryaalu jarugunu nee yedutee svasthatha leeka… sahaayamu leeka… soolipooyaavaa? yeesu naamamuloonee svasthatha – yeesu krupaloonee bhadratha yeesu rakthamuloonee vimoochana – yeesee nadipinchunu jeevamaargaana roogiyaina daasuni koraku shathaadhipathi yeesu prabhuni veedukonenu maata maathram selavimmanagaa vishvasinchina prakaaramee svasthathanu pondenu vishvasinchi adugumu adbhuthaalu jarugunu (2) yeesu nandu vishvaasamunchumu (2) ||yeesu naamamuloonee||
దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను మొక్కుబడి చేసి ప్రార్థించెను దీవింపబడెను కుమారుని పొందెను నీవు అడుగుము నీకివ్వబడును యేసుని ప్రార్థించుము శోధనలనైనా సమస్తమును కోల్పోయిన యోబువంటి విశ్వాసం గమనించుమా యధార్ధతతో నిరీక్షించెను రెండంతల దీవెనలు పొందుకొనెను సహనము చూపుము సమకూడి జరుగును యేసు నందు నిరీక్షించుము
du:kha sthithiloo hannaa thana aathmanu deevuni sannidhini kummarinchukonenu mokkubadi cheesi praarthinchenu deevinpabadenu kumaaruni pondenu neevu adugumu neekivvabadunu yeesuni praarthinchumu shoodhanalanainaa samasthamunu koolpooyina yoobuvanti vishvaasam gamaninchumaa yadhaardhathathoo nireekssinchenu rendanthala deevenalu pondukonenu sahanamu chuupumu samakuudi jarugunu yeesu nandu nireekssinchumu