యేసు నిన్ను నే స్తుతియించుట
yeesu ninnu nee sthuthiyinchuta
యేసు నిన్ను నే స్తుతియించుట మానను మానను మానను కృతజ్ఞతలు నీకు చెల్లించుట ఎన్నడూ మాననే మానను ప్రతికూల పరిస్థితులు వెంటాడు ఘడియలలో నీ సిలువ తట్టు తిరిగి నీ యాగమును తలచి ||యేసు నిన్ను||
yeesu ninnu nee sthuthiyinchuta maananu maananu maananu kruthajnyathalu neeku chellinchuta ennaduu maananee maananu prathikuula paristhithulu ventaadu ghadiyalaloo nee siluva thattu thirigi nee yaagamunu thalachi ||yeesu ninnu||
సిలువపై మరణించి మరాణాన్ని గెలిచి వరముగా నిత్యజీవము నిచ్చితివి నాకింక నిన్ను స్తుతియించకుండా ఉండు కారణమేది లేకపోయెను పరమందు ధనవంతుడు నేనగుటకు దారిద్యములో నీవు జీవించితివి ఈ లోక ధనము నను విడచిపోయి దరిద్రునిగా నే మిగిలినను నీ పరిశుద్ధ రక్తము నా కొరకు కార్చి నా పాప రోగము కడిగితివి ఈనాడు నీవు నా దేహరోగము స్వస్థపరచినా లేకున్నా అసాధ్యుడవు నీవు సర్వాధికారివి సార్వభౌముడవు దయాలుడవు నా జీవితములో నా మేలుకోరకే సమస్తమును జరిగించు వాడవు
siluvapai maranninchi maraannaanni gelichi varamugaa nithyajeevamu nichchithivi naakinka ninnu sthuthiyinchakundaa undu kaarannameedi leekapooyenu paramandu dhanavanthudu neenagutaku daaridyamuloo neevu jeevinchithivi ee looka dhanamu nanu vidachipooyi daridrunigaa nee migilinanu nee parishuddha rakthamu naa koraku kaarchi naa paapa roogamu kadigithivi eenaadu neevu naa deeharoogamu svasthaparachinaa leekunnaa asaadhyudavu neevu sarvaadhikaarivi saarvabhaumudavu dayaaludavu naa jeevithamuloo naa meelukoorakee samasthamunu jariginchu vaadavu