యేసు రాజ నాలో నిన్ను

yeesu raaja naaloo ninnu

🎵 TG-1662🌐 Telugu
పల్లవి

యేసు రాజ నాలో నిన్ను చూడనీ త్వరలో నీలో నన్ను సాగనీ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా – (2)          ||యేసు రాజ||

1వ చరణం

తరిమే తరతరాల ఒరవడిలో ఉరికే పరిసరాల సవ్వడిలో నీ తోడే చాలని – నీ నీడే మేలని నా కోట నీవని – నీ సాటి లేరని ||యేసయ్యా||

2వ చరణం

పెరిగే అన్యాయపు చీకటిలో కరిగే అనురాగపు వాకిటలో నీ మాట చాలని – నీ బాట మేలని నా పాట నీవని – నీ సాటి లేరని

Report Error