యుద్ధ వీరులం – పరిశుద్ధ
yuddha veerulam – parishuddha
యుద్ధ వీరులం – పరిశుద్ధ పౌరులం యూదా గోత్రపు సింహపు ముద్దు బిడ్డలం క్రీస్తు వారలం – పరలోక వాసులం వధించబడిన గొర్రెపిల్ల ప్రేమ దాసులం ముందుకే సాగెదం – వెనుక తట్టు తిరుగము ఈ లోకములో ఉప్పు శిలగ మిగలము మెలకువగా ఉండెదం – ప్రభుని ప్రార్ధించెదం పరలోకముకై మేము సిద్ధపడెదము జయము జయము హోసన్నా జయము జయమని నోరారా రారాజును కీర్తించెదం మనసారా మహా రాజును సేవించెదం ||యుద్ధ||
yuddha veerulam – parishuddha paurulam yuudaa goothrapu sinhapu muddu biddalam kreesthu vaaralam – paralooka vaasulam vadhinchabadina gorrepilla preema daasulam mundukee saagedam – venuka thattu thirugamu ee lookamuloo uppu shilaga migalamu melakuvagaa undedam – prabhuni praardhinchedam paralookamukai meemu siddhapadedamu jayamu jayamu hoosannaa jayamu jayamani nooraaraa raaraajunu keerthinchedam manasaaraa mahaa raajunu seevinchedam ||yuddha||
గర్జించే అపవాది ఎదురు నిలచినా ఎవరిని మ్రింగుదునా అని తిరుగులాడినా శోధనలు శత్రువులా చుట్టు ముట్టినా పాపములో మమ్మును పడద్రోయ జూచినా విశ్వాసమే ఆయుధం – ప్రార్ధనే మా బలం వాక్యమనే ఖడ్గముతో తరిమి కొట్టెదం సిలువలో సాతానుని – తలను చితక త్రొక్కిన మా రాజు యేసులోనే జయము పొందెదం ||జయము||
garjinchee apavaadi eduru nilachinaa evarini mringudunaa ani thirugulaadinaa shoodhanalu shathruvulaa chuttu muttinaa paapamuloo mammunu padadrooya juuchinaa vishvaasamee aayudham – praardhanee maa balam vaakyamanee khadgamuthoo tharimi kottedam siluvaloo saathaanuni – thalanu chithaka throkkina maa raaju yeesuloonee jayamu pondedam ||jayamu||
జయం జయం.. నోరారా రారాజును కీర్తించి జయం జయం.. మనసారా మహా రాజును సేవించి జయం జయం.. మనసారా మహా రాజును సేవించెదం ఇహ లోక ఆశలెన్నో మోసగించినా క్రీస్తు ప్రేమ నుండి విడదీయ జూచినా శ్రమలు అవమానములే కృంగదీసినా బలహీనతలే మమ్మును భంగ పరచినా బ్రతుకుట ప్రభు కోసమే – చావైనా లాభమే పందెమందు ఓపికతో పోరాడెదం నిత్య జీవమివ్వను – మరణమును గెలిచిన మహిమ రాజు క్రీస్తులోనే జయము పొందెదం
jayam jayam.. nooraaraa raaraajunu keerthinchi jayam jayam.. manasaaraa mahaa raajunu seevinchi jayam jayam.. manasaaraa mahaa raajunu seevinchedam iha looka aashalennoo moosaginchinaa kreesthu preema nundi vidadeeya juuchinaa shramalu avamaanamulee krungadeesinaa balaheenathalee mammunu bhanga parachinaa brathukuta prabhu koosamee – chaavainaa laabhamee pandemandu oopikathoo pooraadedam nithya jeevamivvanu – marannamunu gelichina mahima raaju kreesthuloonee jayamu pondedam