కలవంటిది నీ జీవితము కడు
kalavantidi nee jeevithamu kadu
కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము యువకా అది ఎంతో స్వల్పము (2) విలువైనది నీ జీవితం వ్యర్ధము చేయకుము యువకా వ్యర్ధము చేయకుము బహు విలువైనది నీ జీవితం యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది||
kalavantidi nee jeevithamu kadu svalpa kaalamu yuvakaa adi enthoo svalpamu (2) viluvainadi nee jeevitham vyardhamu cheeyakumu yuvakaa vyardhamu cheeyakumu bahu viluvainadi nee jeevitham yuvathee vyardhamu cheeyakumu ||kalavantidi||
నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విష సర్పము యువకా అది కాలు జారే స్థలము ఉన్నావు పాపపు పడగ నీడలో నీ అంతము ఘోర నరకము యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది||
ninnu aakarssinchee ee lookamu kaatu veesee vissa sarpamu yuvakaa adi kaalu jaaree sthalamu unnaavu paapapu padaga needaloo nee anthamu ghoora narakamu yuvakaa adiyee nithya marannamu (2) ||kalavantidi||
నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం నూతన సృష్టిగా మార్చును పాపం క్షమియించి రక్షించును ఆ మోక్షమందు నీవుందువు యుగయుగములు జీవింతువు నీవు నిత్యము ఆనందింతువు
ninnu preeminchu yeesu nee jeevitham nuuthana srusstigaa maarchunu paapam kssamiyinchi rakssinchunu aa mookssamandu neevunduvu yugayugamulu jeevinthuvu neevu nithyamu aanandinthuvu