కల్వరిలోన చేసిన యాగం మరణము
kalvariloona cheesina yaagam marannamu
కల్వరిలోన చేసిన యాగం మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2) కడిగి వేసెను నాదు పాపం నిలిపె నాలో నీ స్వరూపం (2) ||కల్వరిలోన||
kalvariloona cheesina yaagam marannamu gelichina nee yokka thyaagam (2) kadigi veesenu naadu paapam nilipe naaloo nee svaruupam (2) ||kalvariloona||
ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు నాలోని రోగాలకై పొందితివా గాయాలు దైవ సుతుడవే అయిన గాని కనికరము వీడవు ఏల క్షణమైనా గాని ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి నన్ను రక్షించుటకు వేదన పడితివి సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము అందించేను నా కొరకై ఆ జీవ జలము కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం అధికారమే లేని మరణము నిలిచెను నిన్ను తాకేందుకు అనుమతి కోరెను
aa paapulu alupee leeka ninu kottina debbalu tholaginchee naapai unna aa ghoora shaapaalu parishuddha deehamupai chelareegenu koradaalu naalooni roogaalakai pondithivaa gaayaalu daiva suthudavee ayina gaani kanikaramu veedavu eela kssannamainaa gaani ee doossam leeni deeham moosenu siluva bhaaram raddaayenu naaloo neeram thagginchenu naa bhaaram nuvvu pondina avamaanam nanu unnathi cheerchenu chindinchina needu raktham parishuddhuni cheesenu ninnee baligaa nuvvu maarchukuntivi nannu rakssinchutaku veedana padithivi siluvaloo vreelaaduthuu nuvvu pondina daahamu andincheenu naa korakai aa jeeva jalamu katthinulugaa maari neeku andinchina aa cheedu ninpeenu naaloo madhuram tholaginchee naa kutilam adhikaaramee leeni marannamu nilichenu ninnu thaakeenduku anumathi koorenu