కంట నీరేల? కలతలు ఏల
kanta neereela? kalathalu eela
కంట నీరేల? కలతలు ఏల? యేసుతో నీవు సాగు వేళ శోధన వేళ రోదన ఏల? నీ విశ్వసము గెలిచే వేళ (2) నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడు నీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||
kanta neereela? kalathalu eela? yeesuthoo neevu saagu veella shoodhana veella roodana eela? nee vishvasamu gelichee veella (2) nammina aa deevudu – ennadu marachipoodu neeyokka avasaraalu – eenaadoo thaanerigaadu ||kanta||
వలదు చింతన దేనికైనా విన్నవించుము నీ నివేదన పొందితినను నీదు నమ్మకము దరికి చేర్చును తగిన విజయము తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలు పొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||
valadu chinthana deenikainaa vinnavinchumu nee niveedana pondithinanu needu nammakamu dariki cheerchunu thagina vijayamu thirugannadee leenivi – aa thandri deevenalu porapaatu eruganivi – thaanichchu aa meelulu (2) ||kanta||
రేపు గూర్చిన భయము వలదు ప్రతి దినము తగు బాధ కలదు నీదు భారము మోయు ఆ దేవుడు నీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపం స్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
reepu guurchina bhayamu valadu prathi dinamu thagu baadha kaladu needu bhaaramu mooyu aa deevudu neeku mundugaa naduchu ellappudu neelooni aa bhayamu – lookaaniki prathiruupam sthiramaina nee vishvaasam – deevuniki santhoossam (2) ||kanta||