క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా
kraisthavudaa sainikudaa balavanthudaa parishuddhudaa
క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ్ నీవు కదలిరా (4) జాలరీ మనుషులు పట్టు జాలరి ఆత్మలు పట్టు కాపరి అమృతమందించే ఆచారి యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా||
kraisthavudaa sainikudaa balavanthudaa parishuddhudaa kadaliraavooy neevu kadaliraa (4) jaalaree manussulu pattu jaalari aathmalu pattu kaapari amruthamandinchee aachaari yeesukai jeevinchee puujaari ||kraisthavudaa||
సిలువే నీ స్థావరము శ్రమలే నీ సైన్యము (2) సహనమే నీ ధైర్యము వాక్యమే నీ విజయము (2) ||క్రైస్తవుడా||
siluvee nee sthaavaramu shramalee nee sainyamu (2) sahanamee nee dhairyamu vaakyamee nee vijayamu (2) ||kraisthavudaa||
సత్యమే నీ గమ్యము సమర్పణే నీ శీలము యేసే నీ కార్యక్రమం ప్రేమే నీ పరాక్రమం దేశంలో విదేశంలో గ్రామంలో కుగ్రామంలో అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో సిద్ధాంతపు గట్టు దుమికి రా వాగులనే మెట్టును దిగిరా దీనుడా ధన్యుడా విజేయుడా అజేయుడా వాగ్ధాన భూమి స్వతంత్రించుకో అద్వానపు అడవి దాటి ముందుకుపో నీ ఇల్లు పెనూయేలు నీ పేరే ఇశ్రాయేలు
sathyamee nee gamyamu samarpannee nee sheelamu yeesee nee kaaryakramam preemee nee paraakramam deeshanloo videeshanloo graamanloo kugraamanloo adavulaloo kondalaloo pani enthoo phalamenthoo siddhaanthapu gattu dumiki raa vaagulanee mettunu digiraa deenudaa dhanyudaa vijeeyudaa ajeeyudaa vaagdhaana bhuumi svathanthrinchukoo advaanapu adavi daati mundukupoo nee illu penuuyeelu nee peeree ishraayeelu