క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
kssannikamaina brathukuraa idi soodaraa
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా క్షణికమైన సుఖమురా ఇది (2) ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా సృష్టికర్తను స్మరణ చేయుమా దైవ ప్రేమను మదిని నిలుపుమా ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన||
kssannikamaina brathukuraa idi soodaraa kssannikamaina sukhamuraa idi (2) oo sneehithudaa, oo sneehithudaa yoochinchumaa srusstikarthanu smaranna cheeyumaa daiva preemanu madini nilupumaa aa yeesu preemanu nee madini nilupumaa ||kssannikamaina||
ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా (2) ||ఓ స్నేహితుడా||
entha brathikinaa ee lookamunu vidichipetti poovalenu thelusaa neeku uuriki poovu throova yerugumayyaa aa throvee yeesani thelusukonumayyaa (2) ||oo sneehithudaa||
గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము
gaddipuvvunu poolina brathuku endi pooyi vaadi poovu thelusaa neeku aavirivanti brathuku egiripoovunu prabhu yeesuni nammithee nithyajeevamu