నా ప్రియుడు యేసు
naa priyudu yeesu
నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2) ||నా ప్రియుడు||
naa priyudu yeesu – naa priyudu yeesu vreelaadee siluvaloo praannamee bali cheesenila (2) ||naa priyudu||
మెల్లని చల్లని స్వరమే వినబడెను (2) తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు గనుక క్షమించుమనెన్ ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు||
mellani challani svaramee vinabadenu (2) thandree veereemi cheeyuchunnaaroo erugaru ganuka kssaminchumanen aa priya svaramee naa prabhu svaramee ||naa priyudu||
అతని ప్రేమ మధురం మధురం ఎన్నటికీ నే మరువలేను ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం శాపమంతా బాపి నను దీవించెనుగా వీపంతా దున్నబడె నాగలితో కారె రక్త వరదల్ కనుమా యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి నాకై విన్నతి చేయుచున్నాడు రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును
athani preema madhuram madhuram ennatikee nee maruvaleenu dhaaraboosenu jeevam – naakichche nithya jeevam shaapamanthaa baapi nanu deevinchenugaa veepanthaa dunnabade naagalithoo kaare raktha varadal kanumaa yeesu rakthanloo rakssanna – yeesu rakthanloo svasthatha naakai maranninchi thirigi leeche sajeevunigaa thandri kudi paarshvamuna kuurchundi naakai vinnathi cheeyuchunnaadu raanaiyunnaadu veega – meeghamupai vibhudee nannu parama gruhamunaku thoodkoni vellllunu