పేద నరుని రూపము ధరించి
peeda naruni ruupamu dharinchi
పేద నరుని రూపము ధరించి యేసు రాజు నీ చెంత నిలచె అంగీకరించు-మాయనను (2) ||పేద నరుని||
peeda naruni ruupamu dharinchi yeesu raaju nee chentha nilache angeekarinchu-maayananu (2) ||peeda naruni||
కాళ్ళ చేతులందు సీలల్ కొట్టబడెన్ ముళ్ల మకుటము శిరస్సున పెట్టబడెన్ (2) నింద వేదన శ్రమలను సహించెనేసు చిందే తనదు రక్తము నీ పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండె తల వాల్చుటకు ఇల స్థలమే లేదు దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారెవరు లేరు ప్రియ రక్షకుడు సిలువలో వ్రేలాడే పాట్లుపడే నిన్ను విడిపింపను ప్రభు సాతాను తలను చితుక ద్రొక్కెన్ పాప డాగులన్ రక్తముతో కడిగెన్ నీ వ్యాధిని వేదన తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే మాయ లోకమును నీవు నమ్మకుము మనుష్యుల మనస్సు మారిపోవునిల నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో తామసించెదవేల ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము ఈ లోకము నీకివ్వని శాంతిని ఈ దినమే ప్రభువు నీకొసగ ప్రేమతో నిన్ను పిలచుచుండె
kaalllla cheethulandu seelal kottabaden mullla makutamu shirassuna pettabaden (2) ninda veedana shramalanu sahincheneesu chindee thanadu rakthamu nee paapamukai deenudai ninnu pilachuchunde thala vaalchutaku ila sthalamee leedu dappi theerchukona neeru dorakaleedu thannu aadarinchu vaarevaru leeru priya rakssakudu siluvaloo vreelaadee paatlupadee ninnu vidipinpanu prabhu saathaanu thalanu chithuka drokken paapa daagulan rakthamuthoo kadigen nee vyaadhini veedana tholagincha nee shaapamu nundi vidipinpa siluvaloo vijayamu pondee maaya lookamunu neevu nammakumu manussyula manassu maaripoovunila nithya deevuni preemanu nammi neevu nishchayamugaa prabhuvuloo aanandinpa needee rammu vishvaasamuthoo thaamasinchedaveela oo priyudaa priya yeesuni yoddaku leechi rammu ee lookamu neekivvani shaanthini ee dinamee prabhuvu neekosaga preemathoo ninnu pilachuchunde