ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో
preemaloo paddaanu… neenu preemaloo
ప్రేమలో పడ్డాను… నేను ప్రేమలో పడ్డాను… ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను ప్రేమలో ఉన్నాను నేను ప్రేమలో ఉన్నాను నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను స్వార్ధ్యం కలిగిన ప్రేమ కాదు – లాభం కోరే ప్రేమ కాదు కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు – ఆహ శాశ్వతమైన యేసుని ప్రేమ మోహం కలిగిన ప్రేమ కాదు – మోసం చేసే ప్రేమ కాదు పై అందం చూసే ప్రేమ కాదు – పరిశుద్ధమైన ప్రేమ ఇదే కదా ప్రేమంటే – (2) ఈ లోక ప్రేమ కాదు అగాపే ప్రేమ దేవుని ప్రేమ ఇది ||ప్రేమలో||
preemaloo paddaanu… neenu preemaloo paddaanu… preemaloo paddaanu neenu preemaloo paddaanu naa yeesu prabhuni preemaloo paddaanu preemaloo unnaanu neenu preemaloo unnaanu naa yeesu prabhuthoo preemaloo unnaanu svaardhyam kaligina preema kaadu – laabham kooree preema kaadu koddi kaalamee undee preema kaadu – aaha shaashvathamaina yeesuni preema mooham kaligina preema kaadu – moosam cheesee preema kaadu pai andam chuusee preema kaadu – parishuddhamaina preema idee kadaa preemantee – (2) ee looka preema kaadu agaapee preema deevuni preema idi ||preemaloo||
మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు నా ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే మొదటగా ప్రేమించింది నేను కాదు నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే కోరినాడు పిలిచినాడు – నేను ఎదో మంచి వ్యక్తినైనట్టు కుమ్మరించే ప్రేమ మొత్తం – నేను తప్ప ఎవ్వరు లేనట్టు ఆకశాన తనలో తాను – పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భువిలో నాపై ప్రేమ ఎందుకో ఏమి తిరిగి ఇవ్వలేని – ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో హే… ఇంత గొప్ప ప్రేమ రుచి చూసాక నేను ప్రేమించకుండ ఎట్లా ఉంటాను అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండ ఎట్లగుంటాను ||ఇదే కదా||
modatagaa prapooj cheesindi neenu kaadu naa priyudee thana preema vyakthaparichee modatagaa preeminchindi neenu kaadu naa yeesee thana preema vyakthaparichee koorinaadu pilichinaadu – neenu edoo manchi vyakthinainattu kummarinchee preema moththam – neenu thappa evvaru leenattu aakashaana thanaloo thaanu – paripuurnnunigaa unna prabhuvuku bhuviloo naapai preema endukoo eemi thirigi ivvaleeni – ee chinna jeevi paina prabhuvuku antha preema deenikoo hee… intha goppa preema ruchi chuusaaka neenu preeminchakunda etlaa untaanu antha goppa preema chuupu preemikuniki ai lav yu cheppakunda etlaguntaanu ||idee kadaa||
తన ప్రేమకు ఋజువేంటని నేనడుగక ముందే నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచె ప్రేమకు ఋజువేంటని నేనడగక మునుపే నా యేసు తన ప్రేమ రుజువు పరిచె పాపమనే కూపమందు – నేను బంధీనైయుండఁగా పాపమనే అప్పు చేత – బానిసై నేను అలసియుండగా గగనపు దూరము దాటి వచ్చి – సిలువలో చేతులు పార చాపి నువ్వంటే నాకింత ప్రేమనే రక్తముతో నను సంపాదించి – నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే హే… నన్ను తన సొత్తు చేసుకున్నాడు నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు మరల వచ్చి పెళ్లి చేసుకుంటాడు అని నిశ్చితార్ధం చేసుకొని వెళ్ళాడు ప్రేమతో నా ప్రియుడు రాసెను ప్రేమ లేఖ వాక్యమనే పరిశుద్ధ ప్రేమ లేఖ ప్రేమతో నా యేసు రాసెను ప్రేమ లేఖ ఆ లేఖ చదువుతుంటే – నా ప్రియుని తలపులు నాలో నిండే ప్రభుని ప్రేమ లోతు తెలిసి – నా యేసుపై పొంగి పొరలే రేయింబవలు ప్రభు కావాలని – తనతో ఎప్పుడు కలిసుండాలని నా ప్రాణము పరి తపియించెనే యుగయుగములు నన్నేలేడివాడు – అని త్వరలోనే రానున్నాడని ఆత్మలో కలిగే ప్రేమ పరవశమే హే… వింత అయిన ఆ యేసు ప్రేమ గూర్చి నేను సర్వ లోకమునకు చాటి చెబుతాను యేసు రక్తమందు శుద్ధులైన వారే ఆ ప్రేమ రాజ్యమందు ఉందురంటాను
thana preemaku rujuveentani neenadugaka mundee naa priyudu thana preema rujuvu pariche preemaku rujuveentani neenadagaka munupee naa yeesu thana preema rujuvu pariche paapamanee kuupamandu – neenu bandheenaiyundamgaa paapamanee appu cheetha – baanisai neenu alasiyundagaa gaganapu duuramu daati vachchi – siluvaloo cheethulu paara chaapi nuvvantee naakintha preemanee rakthamuthoo nanu sanpaadinchi – naa kallllalloo kallllu petti neepai pichchi preema naakanee hee… nannu thana soththu cheesukunnaadu naa paapa katlu thenpi sveechchhanichchaadu marala vachchi pellli cheesukuntaadu ani nishchithaardham cheesukoni vellllaadu preemathoo naa priyudu raasenu preema leekha vaakyamanee parishuddha preema leekha preemathoo naa yeesu raasenu preema leekha aa leekha chaduvuthuntee – naa priyuni thalapulu naaloo nindee prabhuni preema loothu thelisi – naa yeesupai pongi poralee reeyinbavalu prabhu kaavaalani – thanathoo eppudu kalisundaalani naa praannamu pari thapiyinchenee yugayugamulu nanneeleedivaadu – ani thvaraloonee raanunnaadani aathmaloo kaligee preema paravashamee hee… vintha ayina aa yeesu preema guurchi neenu sarva lookamunaku chaati chebuthaanu yeesu rakthamandu shuddhulaina vaaree aa preema raajyamandu undurantaanu